మద్యం మత్తునా ? నిద్ర మత్తునా ?

తెలంగాణ స్పెషల్ ఫోకస్

రేష్ డ్రైవింగ్

మద్యం మత్తునా ? నిద్ర మత్తునా ?

యవకులా..మజాకా

హైదరాబాద్:

నగరంలోని లుంబినీ పార్క్ వద్ద ఓ కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో వస్తున్న కారు యూటర్స్ వద్ద మలుపు తీసుకుంటున్న సమయంలో అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఫుట్‌పాత్ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ హుస్సేన్‌సాగర్‌లో పడిపోయింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారు అంబర్‌పేటకు చెందిన మణికంట, వత్సల్, ఎం.రమణీయ, పవన్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హుస్సేన్‌సాగర్‌లో పడిన కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి నిద్రమత్తా లేక మద్యం మత్తా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *