కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రాజకీయం

https://youtu.be/v0rfkmSdMj0కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ. భారత దేశ వ్యాప్తంగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీల అభివృద్ధి పురోగతి సాధ్యం అవ్వాలంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీలు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపినారేగాని ఇంతవరకు బిల్లు చట్టం దాల్చలేదు. చంద్రబాబు బిల్లు కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు కానీ ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వంలో బీసీ బిల్లు పై సంప్రదించిన దాఖలాలే లేవు. అప్పట్లో వై.ఎస్.ఆర్.సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా బిసి బిల్లును ప్రైవేటు బిల్లుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కానీ టీడీపీ ఎంపీలు స్పందించలేదు కనుక బిజెపి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చింది బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకోకుండా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు ను ఆమోదించి చట్టం చేసి బి జె పి పార్టీ తమ ఘనతను చాటుకోవాలని అవసరం అయితే రాజ్యాంగ సవరణ నైన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పద్మజ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, శివ శంకర్, హనుమంతరావు, మునిరాజు, దయాకర్ యాదవ్, శ్రీనివాసులు, కృష్ణ యాదవ్, విజయ్ కుమార్, జై రామ రాజు, లక్ష్మణ రాజు, రమణయ్య, రామ కృష్ణ యాదవ్, నాగేశ్వరరావు, మహా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *