కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ స్పెషల్ ఫోకస్

కోదాడలో ఓ వైద్యుడి నిర్వాకం .. నర్సుతో ప్రేమాయణం .. గర్భవతి అయిన నర్సు

ఇక అసలు విషయానికి వస్తే కోదాడలో ఓ ప్రముఖ వైద్యుడు గా పేరున్న ఓ డాక్టర్ తన వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. ఇక విషయం ఆస్పత్రిలోనే కాదు డాక్టర్ గారి భార్య దాకా వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య సదరు నర్సును వైద్యశాలనుంచి బయటకు పంపించింది. అయినా సదరు వైద్యుడు ఆ నర్సుతో స్థానికంగానే వేరే చోట రహస్య కాపురం పెట్టించాడు. నీకు నేను అండగా ఉంటానని నమ్మించాడు . ఇక ఆమెను అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి పెంచాడు. అందుకు ఆమె ససేమిరా అంటూ ఒప్పుకోకపోవడంతో ఆమెకు పరిహారంగా తాను ఇస్తానని మాట ఇచ్చిన వాటిని రోగులకు మందులు రాసే చిట్టీ మీద తన ఇష్టపూర్తిగా రాసి ఇచ్చారు .
అబార్షన్ చేయించుకోవాలని హామీలను మందుల చీటీ మీద రాసిచ్చిన వైద్యుడు

ఇక మందుల చీటీ మీద రాసిన ఆ హామీల చిట్టా చూస్తే యువతి పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తానని 100 గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తానని, రూ.3 లక్షల విలువ చేసే బంగారం ఇస్తానని సంతకం చేసి ఇచ్చాడు. దీంతో ఆమె అబార్షన్‌ చేయించుకోవడానికి ఒప్పుకుంది. ఇక కోదాడలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాల వైద్యుడిని సంప్రదించి అబార్షన్ చెయ్యాలని కోరింది. ఆయన అబార్షన్‌ చేయడానికి నిరాకరించి విషయం ఆరా తియ్యగా సదరు యువతి తనకు వైద్యుడు రాసి ఇచ్చిన హామీల చీటీని ఆ వైద్యుడికి చూపించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మందుల చీటీ పై డాక్టర్ గారి హామీల చీటీ .. నోరెళ్ళబెడుతున్న జనాలు

ఇక దీంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఇక సోషల్ మీడియా లో వైరల్ చెయ్యటానికి ఎవరు పోస్ట్ పెట్టారో ఏమోగాని ఈ చీటీ ఇప్పుడు స్థానిక సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కోదాడలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. డాక్టర్ గారి నిర్వాకంపై జనం నోరెళ్ళబడుతున్నారు. పవిత్రమైన వృత్తిలో ఉండి అపవిత్రమైన పనులు చెయ్యటం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. అబార్షన్ చేయించుకుంటే మాత్రం ఆ యువతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా ? డాక్టర్ అయి ఉండి ఇదేం పాడుపని అంటూ తలా ఓ మాట అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *