ఆత్మకూరు మండల అధ్యక్షుడు కొండ్రెడ్డి రమణారెడ్డి రాజీనామా.

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రాజకీయం

నెల్లూరు జిల్లా.

జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.

ఆత్మకూరు మండల అధ్యక్షుడు కొండ్రెడ్డి రమణారెడ్డి రాజీనామా.

ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తాను రమణారెడ్డి.

ఆత్మకూరులో పెద్దదిక్కును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.ఆ పార్టీకి చెందిన కొండ్రెడ్డి రమణారెడ్డి ఆత్మకూరు మండలానికి పార్టీ అధ్యక్షునిగా గత ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. అయితే ఈరోజు కొండ్రెడ్డి రమణారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన మనసులోని భావాలను వెల్లడించారు.తాను గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చేవూరు దేవకుమార్ రెడ్డి,చేవూరు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేశాను అన్నారు.అయితే నన్ను నమ్ముకున్న మిత్రులు, అభిమానులకు సరైన న్యాయం చేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తనను నమ్ముకున్న వర్గానికి న్యాయం చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ నుండి శాశ్వతంగా బయటకు వచ్చినట్లు తెలిపారు.తనకు కాంగ్రెస్ పార్టీలో చేవూరు దేవకుమార్ రెడ్డి చేవూరు శ్రీధర్ రెడ్డి తగిన ప్రాధాన్యత ఇచ్చారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తాను తన అనుచరవర్గం తో మాట్లాడి త్వరలో ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానన్నారు.ఏది ఏమైనా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఓ బలమైన వ్యక్తిగా కొనసాగుతున్న కొండ్రెడ్డి రమణారెడ్డి పార్టీకి రాజీనామా చేయటం కాంగ్రెస్ పార్టీకి మంచి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *