చెరువు కట్ట ఎత్తు తగ్గించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం-కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రాజకీయం

చెరువు కట్ట ఎత్తు తగ్గించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

నెల్లూరులోని నెక్లెస్ రోడ్ చెరువు కట్ట ఎత్తు ను తగ్గించినట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిరూపిస్తే ఏ శిక్ష అయినా సిద్ధమని మాజీ నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నాపై మంత్రి అనిల్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అవి మానుకోవాలన్నారు. నెక్లెస్ రోడ్డు చెరువు కట్ట ను 16 మీటర్లు ఎత్తు చేశామన్నారు. ఎవరూ చేయని విధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెక్లెస్ రోడ్డు, బారా షాహిద్ దర్గా అభివృద్ధిచేశామన్నారు .పిడబ్ల్యుడి అధికారుల అనుమతి లేకుండా కాలువలు పూర్తి చేయాలని మంత్రి అనిల్ మాట్లాడడం విచారకరమన్నారు. పిడబ్ల్యుడి అధికారుల అనుమతులతో కాలువ నిర్మాణాలు చేపట్టామన్నారు. మంత్రి అనిల్ కుమార్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. వర్షాకాల సమయంలో చెరువు కింద ప్రాంతాలు మన ప్రాంతానికి గురై లేవన్నారు. చెరువు కట్ట ఎత్తు పెరగడం వల్ల ఆ సమస్య వాటిల్లకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తనపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేయడం విచారకరమని తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంత్రి అనిల్ కుమార్ బారా షాహిద్ దర్గా, నెక్లెస్ రోడ్డు ఆగిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. నెల్లూరు ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నదే తన సంకల్పం అన్నారు. మంచి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు అభివృద్ధి చేయాలని కాలయాపన లేకుండా నక్లెస్ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. మంత్రి ఆరోపణలు అవాస్తవమన్నారు.659

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *