మామను కడతేర్చిన అల్లుడు కారూరు లో దారుణం

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ నెల్లూరు

మామను కడతేర్చిన అల్లుడు
కారూరు లో దారుణం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపలేదని ఆగ్రహించిన అల్లుడు మద్యం మత్తులో మామను గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీసీ కాలనీకి చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (60) సంవత్సరాలు అనే వ్యక్తి తన కుమార్తెను రాపూరు మండలం చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు తాగుబోతు కావడంతో పెళ్లి అయిన కొద్ది రోజులకే శ్రీనివాసులు కుమార్తె పిల్లలను తీసుకొని కారూరు వచ్చి తండ్రి వద్ద ఉంటుంది. శ్రీనివాసులు అల్లుడు అప్పుడప్పుడు వచ్చి తన భార్య పిల్లలను తనకు పంపాలని గొడవ చేసేవాడు. నేపథ్యంలో సోమవారం రాత్రి కారూరు వచ్చిన శ్రీనివాసులు అల్లుడు మామ తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న కోడలితో మామ నరికి చంపాడు అనంతరం పరారయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క కేసులు లేకుండా చేసేందుకు కొందరు వైట్ కలర్ గాళ్ళు రంగంలోకి దిగినట్లు సమాచారం. మృతి చెందిన శ్రీనివాసులు లు గ్రామంలో పెద్దమనిషిగా ఉంటూ సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా అ పేరు ప్రఖ్యాతులున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *