నేరస్థులకు సహాయం చిలుక అరెస్ట్

జాతీయం స్పెషల్ ఫోకస్

[3:47 PM, 4/26/2019] Srinivasula Reddy Sakshi: నేరస్థులకు సహాయం
చిలుక అరెస్ట్

(ఆదాబ్ హైదరాబాద్):చిలుకను సాధారణంగా పంజరంలో ఉంచుతారు. కానీ వీరు మాత్రం మనుషుల్ని నిర్బంధించినట్లు జైల్లో పెట్టారు. ఎందుకో తెలుసా.. ఆ చిలక నేరస్థులకు సాయం చేయడమే. వివరాల్లోకి వెళితే.. ఈ విస్తుగొలిపే ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. అక్కడ స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు.. నిందితులు ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్‌ను సరఫరా చేస్తున్నారన్న  సమాచారం అందింది. దీంతో ఆ ఇంటికి చేరుకొని దుండగులను నేరుగా పట్టుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అనుకున్న వెంటనే అక్కడికి పెద్ద ఎత్తున బలగాలతో చేరుకున్నారు. లోపల గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్న స్మగ్లర్లకు మాత్రం ఈ విషయం తెలియదు. కానీ.. గుమ్మం వద్ద పంజరంలో ఉన్న చిలుక బలగాల రాకను పసిగట్టింది. వెంటనే ‘మమ్మా.. పోలీస్’ అని అరిచింది. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు మరో మార్గం ద్వారా అక్కడి నుంచి పారిపోయారు. లోపలికి వెళ్లి చూసిన పోలీసులకు చివరకు నిరాశే మిగిలింది. చిలుక అరవడం వల్లే వాళ్లు అక్కడి నుంచి పారిపోయారని అర్థమైంది. దీంతో నేరస్థులకు సహరించిందన్న అభియోగం కింద చిలుకను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

అనంతరం జరిగిన విచారణలో ఆ చిలుక నోరు మాత్రం మెదపలేదట. దాన్ని వదిలిపెట్టాలంటూ పర్యావరణ, పక్షి ప్రేమికులు నుంచి డిమాండ్లు రావడంతో చేసేదిలేక స్థానిక జంతుప్రదర్శనశాలకు అప్పగించారు. ఎగరడానికి దానికి మూడు నెలల పాటు శిక్షణనిచ్చి అనంతరం వదిలిపెడతారట. బ్రెజిల్‌లో డ్రగ్స్‌ సరఫరాదారులు జంతువులను వినియోగించుకోవడం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. కానీ ఈ తరహాలో పక్షుల్ని ఉపయోగించడం మాత్రం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. అందుకనుగుణంగా దానికి శిక్షణనిచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2010లో కొలంబియాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పోలీసులు ఓ ఇంటి మీద రైడ్ చేయడంతో తన యజమానికి ‘రన్, రన్’ అంటూ ఓ చిలుక సంకేతాలిచ్చింది.
[3:47 PM, 4/26/2019] Surendra Naidu: All ready పెట్టాశా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *