పశ్చిమబెంగాల్ తీవ్ర ఉద్రిక్తత

క్రైమ్ జాతీయం స్పెషల్ ఫోకస్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో రెండవ దశ పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. టీఎంసీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఘర్షణ పడ్డారు. రాయ్‌గంజ్ నియోజకవర్గంలో అల్లరిమూకలు రాళ్లు రువ్వటంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. మరోవైపు ఓ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనివ్వటం లేదని బీజేపీ అభ్యర్థి దేబశ్రీ చౌధురి ఆరోపించారు. చోప్రాలోని ఓ పోలింగ్ బూత్‌లో తమను ఓటేసేందుకు అనుమతినివ్వటం లేదని స్థానికులు 34వ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి టియర్ గ్యాస్‌ను వినియోగించారు. పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్, డార్జీలింగ్, జల్పైగురి నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *