ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం

క్రైమ్ జాతీయం స్పెషల్ ఫోకస్

దంతెవాడ:చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో రిజర్వ్ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దంతెవాడలోని ధనికార్క్ అడవుల్లో గాలిస్తుండగా కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు కాల్పులు జరుపగా రిజర్వు గార్డులు తిరిగి కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కంకర్, రాజనందన్ గామ్, మహాసముందలో గురువారం పోలింగ్ సాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *