కాస్త త‌గ్గిన పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు

ఆంధ్రప్రదేశ్ జాతీయం

AP NEWS TODAY – అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగొస్తున్నాయి. వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 15పైసలు తగ్గి రూ. 81.10కి చేరింది. ఇక బుధవారం స్థిరంగా ఉన్న డీజిల్‌ ధర కూడా నేడు కాస్త తగ్గింది. దిల్లీలో 5 పైసలు తగ్గడంతో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 74.80గా ఉంది.ఇక లీటర్ పెట్రోల్‌ ధర కోల్‌కతాలో రూ. 82.95, ముంబయిలో రూ. 86.58, చెన్నైలో రూ. 84.28, హైదరాబాద్‌లో రూ. 85.98గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర కోల్‌కతాలో రూ. 76.65, ముంబయిలో రూ. 78.41, చెన్నైలో రూ. 79.15, హైదరాబాద్‌లో రూ. 81.36గా ఉంది.ఇటీవల రెండు నెలల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. దీంతో పెట్రో భారం నుంచి వినియోగదారులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై రూ. 2.50చొప్పున సుంకాన్ని తగ్గించింది. తాజాగా ముడిచమురు ధరలు దిగిరావడంతో గత ఎనిమిదిరోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *