సోమవారము మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని సూళ్ళూరుపేటలో

ఆంధ్రప్రదేశ్ భక్తి స్పెషల్ ఫోకస్

సోమవారము మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని సూళ్ళూరుపేటలో చిత్రకూటమి నందు ఆర్యవైశ్యకళ్యాణనిలయంలో లింగోద్భవకాల సమయములో రాత్రి గం.10:30 ని.ల నుండి మహన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకములు నిర్వహింప బడు తున్నాయ్.ఈ కార్యక్రమములలో గణపతిపూజ,శుద్దిపుణ్యాహవాచనం,మహన్యాసపారాయణం,నమకచమకాలతో ఏకాదశరుద్రాభిషేకములు,శ్రీసూక్తపూర్వక కుంకుమార్చన,మంత్రపుష్పము మరియు విచ్చేసిన భక్తులకు మహాదాశీర్వచనములు ఉంటాయి. కావున సభ్యులందరూ పై కార్యక్రమమునకు విచ్చేసి స్వయంగా మీ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకములు చేసుకొని స్వామివారి యెక్క ప్రసాదములు స్వీకరించి ఆ పార్వతీపరమేశ్వరుల కృపకు పాత్రులు కాగలరని మనవి.విచ్చేయి సభ్యులు సాంప్రదాయ వస్త్రాలతో మాత్రమే విచ్చేయ వలెను.అభిషేకము లు చేసుకొనువారు వస్తురూపములో కాని,దనరూపంలో కాని ఇచ్చిన స్వామివారి అభిషేకములకు ఉపయోగించగలము.ముందుగా అభిషేకములకు వస్తు,ధన రూపంలో ఇచ్చువారు తమను సంప్రదించ గలరని సహాయక కార్యదర్శిశ్రీ శ్రీనివాసరావుగారు మరియు మహిళా ప్రధానకార్యదర్శి శ్రీమతి నాగేంద్రకుమారి ( శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య సూళ్ళూరుపేట ) తెలిపారు . అత్యంత ప్రతిష్టాత్మక హిందూ పండుగ లలోమహా శివరాత్రి ప్రతి చంద్ర నెలలో 14 వ రోజు జరుపుకుంటారని ఈ సంవత్సరంలో 12 శివరాత్రి లు మరియు ఒక మహా శివరాత్రి ఉన్నాయని ఈ సంవత్సరం ఇది మార్చి 4 న వచిందని ఈ రోజు శివున్ని భక్తులు దేశ వ్యాప్తం గా శివ దేవాలయాన్ని సందర్శిస్తారని పూజలు ఆలస్యంగా సాయంత్రం నిర్వహిస్తారని కొన్ని ఆలయాలలో, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారని మహా శివరాత్రి 2019 భారతదేశం లో మహా శివరాత్రి ని శివుని గౌరవంతో జరుపుకుంటారని ఇది అత్యంత పవిత్రమైన హిందూ పండుగలు ఒకటి కాగా ఇది శీతాకాలం ముగింపు మరియు వసంతకాలం ప్రారంభమై, శివుని మరియు శక్తి ల యొక్క కలయిక రోజుగా భావిస్తారని వారు అన్నారు .
ఈ రోజున శివుణ్ణి పూజించి నట్లయితే మనకు సర్వశక్తి మంతుడైన శివుడు మిమ్మల్ని మంచి ఆరోగ్యంతో ఆశీర్వదిస్తాడని పురాణాలు చెబు తున్నాయని అందులో భాగం గా నేడు సూళ్లూరుపేట లోని ఇతర పండుగ ల మాదిరి గా కాకుండా, మహా శివరాత్రి రాత్రి వేళలోనే ఎక్కువగా జరుపు కుంటా రన్నారు . ఇది ఒక గంభీరమైన ఉత్సవం . చాలా మంది ప్రజలు ఈ రోజున పగలు ఉపవాసం పాటించి శివా లయాలలో ప్రార్ధనలు మరియు పండ్లు అందిస్తారని ఈ రోజున శివుని దేవాలయాలలో రాత్రిపూట జాగరణ ఉంటుందని అలాగే శివుని దేవాలయాలు విద్యుత్ లైట్లు మరియు రంగు రంగుల పుష్ప అలంకరణలతో ద్వేదీపమానం గా అలంకరించబడతాయని నిగ్రహాన్ని, క్షమాపణ, పశ్చాత్తాపం, నిజాయితీ మరియు దయపై దృష్టి పెట్టడానికి కూడా ఇది సమయాను కూలమని కూడా వారు అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *