గుర్తు తెలియని వైరస్‌తో 64 మంది మృతి

క్రైమ్ జాతీయం స్పెషల్ ఫోకస్

గుర్తు తెలియని వైరస్‌తో 64 మంది మృతి

ఇండోర్ : గుర్తు తెలియని వైరస్ ప్రబలడంతో 64 మంది మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో సంచలనం రేపింది. నాలుగునెలల్లో 64 మంది మరణించడంతో జనం ఆందోళన చెందుతున్నారు. వైద్యాధికారులు గుర్తుతెలియని వైరస్ సోకిన రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి భోపాల్ నగరంలోని వైరాలజీ ల్యాబోరేటరీకి పంపించారు. రక్తనమూనాల్లో 39 మందికి స్వైన్ ఫ్లూ, 350 మందికి డెంగీ వ్యాధులు సోకాయని తేలింది. 2015లో కాలిఫోర్నియాలో స్వైన్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. మొట్టమొదటిసారి హెచ్1 ఎన్1 వైరస్ తో రోగి మరణించారని తేలింది. ప్రతి ఏటా స్వైన్ ఫ్లూ వైరస్ లో మార్పులు వస్తున్నాయని డాక్టర్ అమిత్ మాలేకర్ చెప్పారు. స్వైన్ ఫ్లూ లక్షలున్నా రోగుల రోగనిరోధక శక్తి తగ్గడంతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *