చంద్రబాబు సంచలన నిర్ణయం.. పార్లమెంట్ చివరి రోజు దీక్ష!

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోకస్

చంద్రబాబు సంచలన నిర్ణయం.. పార్లమెంట్ చివరి రోజు దీక్ష!

అమరావతి: ఏపీ హక్కుల కోసం సీఎం చంద్రబాబు కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు ఏపీ గొంతును వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై ప్రజల తరుపున మాట్లాడేందుకు ఎప్పటికప్పుడు టీడీపీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలను గమనిస్తూ వీడియో కాన్ఫరెస్స్ ద్వారా ఎంపీలకు పలు సూచనలు చేస్తున్నారు. అంతేకాదు పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజు ఓ అస్త్రాన్ని సంధించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఒక రోజు దీక్ష చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు వినికిడి. రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా దీక్షకు కూర్చుంటే ఎలా ఉంటుందనే అంశంపై టీడీపీపీ భేటీలో చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు దీక్షకు కూర్చుంటే జాతీయ నేతలంతా వచ్చి మద్దతు తెలుపుతారని ఎంపీ సుజనాచౌదరి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలను బడ్జెట్‌లో పరిష్కరించపోతే దీక్షకు దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు దీక్ష ద్వారా ఏపీకి ఎన్డీయే ప్రభుత్వం చేసిన అన్యాయం … మరోసారి జాతీయ స్థాయిలో ప్రధాన అంశం అవుతుందని నేతలు భావిస్తున్నారు.

నవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైన, న్యాయమైన హామీలు. వాటిని పూర్తిగా నెరవేర్చడం కేంద్రం బాధ్యత!’ అంటూ సీఎం చంద్రబాబు ‘ధర్మ పోరాట దీక్ష’లు చేస్తున్న విషయం తెలిసిందే. ధర్మపోరాట దీక్ష విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గత ఏడాది ఏప్రియల్ దీక్ష ప్రారంభించారు. ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈ దీక్ష సాగింది. చంద్రబాబుకు మద్దతుగా 13 జిల్లాల్లో మంత్రుల దీక్షలు చేపట్టారు.అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షను పార్టీ శ్రేణులు ప్రారంభించాయి. కాగా సీఎం ధర్మ పోరాట దీక్షకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇది ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న దీక్ష కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మపోరాట దీక్షలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *