కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి నూతన పాలకవర్గం నియామకం

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోకస్

కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి నూతన పాలకవర్గం నియామకం

గుంటూరు జిల్లా నరసరావుపేట :ప్రముఖ శైవక్షేత్రం శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది పాలకవర్గం చైర్మన్ ట్రస్టీ మల్రాజ్ వెంకట రామకృష్ణ కొండలరావు నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా గ్రామానికి చెందిన చపారపు గోపాల్ రెడ్డి నరసరావుపేట కు చెందిన అనుమోలు వెంకయ్య చౌదరి, బెల్లంకొండ పిచ్చయ్య, బొగ్గరపు కృష్ణ ప్రసాద్ మండవ రంజిత్ కుమార్, తిరుమల కొండ నరసింహారావు, సత్తెనపల్లికి చెందిన పోతుగంటి రామకోటేశ్వరరావు, ఎల్ రవి, చిలకలూరిపేట కు చెందిన గోరంట్ల నారాయణ, రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన సంధ్యారాణి,ఎక్స్ అఫీషియో మెంబర్ గా నరసరావుపేటకు చెందిన కొండ కావూరి నాగ భోగేశ్వర రావు నియమితులయ్యారు. తొలి పాలకవర్గ సభ్యులు గా పనిచేసిన బెల్లంకొండ పిచ్చయ్య అనుమోలు వెంకయ్య చౌదరి లకు మరోసారి పాలకవర్గ సభ్యులు గా అవకాశం దక్కింది. త్వరలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *