చంద్రబాబు శ్వేత పత్రాలపేరుతో జనాన్ని మరోసారి వొంచించే ప్రయత్నం చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు శ్వేత పత్రాలపేరుతో జనాన్ని మరోసారి వొంచించే ప్రయత్నం చేస్తున్నారు

మాజీ మంత్రి ఆనంరామనారాయణరెడ్డి

(ఏపీ న్యూస్ టుడే స్టాఫ్ రిపోర్టర్) (సురేంద్ర):

ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రాలపేరుతో జనాన్ని మరోసారి వొంచించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ఆదివారం రాపూరు లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయకపోవటం బాధాకరమన్నారు
ప్రభుత్వ వైఫల్యం వొల్లే రాష్ట్రంలో కుటుంబాల వలసలు పెరిగిపోయాయిని, హైకోర్టు కోసం అఫడవిట్ అడిగి ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. హైకోర్టు విషయంలో జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని, అన్నిరంగాల్లో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రతీ అంశంలో యూ టర్న్ తీసుకొంటున్నారన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శ్వేతపత్రాల డ్రామాకి తెరలేపారన్నారు. మోదీ లాంటి సమర్థ వొంతమైన ప్రధాని ప్రపంచదేశాల్లోనే లేడని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు అదే నోటితో విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు.
రాష్ట్రానికి కేంద్రం పంపుతున్న నిధులను జన్మభూమి కమిటీలు దోచుకుతింటున్నాయిన్నారు.
కెసిఆర్ వాఖ్యలను తప్పుపట్టడం మాని వాటిలోని వాస్తవాలను గ్రహించాలన్నారు. రాష్ట్ర ప్రజల తిరస్కారంతో టీడీపీ కి ఓటమి తప్పదని, దివంగతనేత వైఎస్ తరహా పాలనకోసం నవరత్నాలతో వొస్తున్న జగన్ ని ఆశీర్వదించండిని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *