భారతీయ రైల్వే చరిత్ర లోనే నూతన రైలు “ట్రైన్ 18” ఒక మైలురాయి

జాతీయం స్పెషల్ ఫోకస్

భారతీయ రైల్వే చరిత్ర లోనే నూతన రైలు “ట్రైన్ 18” ఒక మైలురాయి

భారతీయ రైల్వేలో నూతన అధ్యాయం మొదలు కాబోతోంది. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) అభివృద్ధి చేసిన తొలి స్వయం చాలిత (ఇంజిన్ లేని) రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ‘ట్రైన్ 18’గా పిలిచే ఈ రైలు గరిష్ట వేగం గంటకు 220 కిలోమీటర్లు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సక్సెసర్‌గా దీనిని అభివృద్ధి చేశారు.

మొరాదాబాద్-రాంపూర్ సెక్షన్‌లో ‘ట్రైన్ 18’కు
ఉత్తర రైల్వే ట్రయల్ రన్ నిర్వహించింది. వివిధ వేగాల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమైనాయి.

తొలుత గంటకు 30 కిలోమీటర్లు, తర్వాత 50, అనంతరం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ నిర్వహించారు.

‘ట్రైన్ 18’లో డ్రైవింగ్ కోచ్‌తో కలిపి మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ట్రైలర్ కోచ్‌లలో 44, 78 సీట్లు ఉంటాయి. బేబీ కేర్ కోసం ప్రత్యేక సదుపాయం, డిసేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్లు, ప్రత్యేక ప్యాంట్రీ కార్లు ఉన్నాయి. అలాగే, ప్లాట్‌ఫాంలో రైలుకు ముందు వెనక సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చారు. డోర్లు మూసివేసే ముందు ప్రయాణికులను డ్రైవర్ గమనించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే రైల్వేలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *