మీడియాతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

నెల్లూరు జిల్లా ముత్తుకూరులో మీడియాతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్

రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని.. 3 లక్షల కోట్ల దోపిడీ జరిగిందని, ఒక్క ఇరిగేషన్ లో 20 వేల కోట్లు తినేశారని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజేయ్ కల్లం రెడ్డి ఆరోపిస్తున్నారు..

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫైనాన్స్ సెక్రటరీగా, రెవెన్యూ, ఎక్సైజ్ స్పెషల్ సీఎస్ గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

ఇన్ని లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే ఉన్నతాదికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏం చేస్తున్నారు..నిద్రపోతున్నారా..

అజేయ్ కల్లాం రెడ్డి అంత చేత కాని అధికారా..మీ ద్వారా నడిచిన ఫైళ్లలో అవినీతి జరుగుతుందని ఎప్పుడైన రెఫర్ చేశారా..కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా..

ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని, ప్రభుత్వాన్ని పొగుడుతారు. రిటైర్డ్ అవగానే తిడతారా..మీ బ్యాచ్ కి ఇదే పనా

600 మంది ఒక్కొక్కరు రూ.500 కోట్లు సంపాదించారా…మీ మాటలు చూసి జనం నవ్వుకుంటారు..

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి మీకు కడుపు మండిపోతోంది..

జగన్ కి ఆయన మీడియాకు తొత్తులుగా వ్యవహరించడం ఎంత వరకు న్యాయం

జగన్ పై ప్రేమతో చంద్రబాబు ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు..

ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తూ మీ స్వార్ధ రాజకీయాల కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతారా..

రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు..మంచి ఇమేజ్ ఉండకూడదనే మీ ఉద్దేశం

పెట్టుబడులు పెట్టేందుకు సులభతరమైన రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం

నైపుణ్యం కలిగిన మానవ వనరులు కలిగిన రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం..

నాలుగేళ్లలో 10.5 శాతం వృద్ధి రేటుతో దేశంలోని మొదటిస్థానంలో కొనసాగుతున్నాం..

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కంటే వృద్ధి రేటులో ముందున్నాం..

అన్ని రంగాల్లో అభివృద్ధిలో దేశంలో అగ్రగామిగా నిలిచాం..

సీఎం చంద్రబాబు కృషితోనే ఇది సాధ్యమైంది.

అభివృద్ధి విషయంలో రాష్ట్రానికి అనేక అవార్డులు వస్తుండటం చూసి మీ బ్యాచ్ ఓర్చుకోలేకపోతోంది..

12 కేసుల్లో ముద్దాయి అయిన జగన్ గురించి ఎందుకు మాట్లాడరు..

వైఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ గురించి ఒక్క మాట మాట్లాడలేరు..

మీ అసలు స్వరూపం బయటపడుతోంది…రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బతీయడం మీ తరం కాదు..

అజేయ్ కల్లాం అంటే ఒక విలువలతో కూడిన అధికారిగా వ్యక్తిగతంగా ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు..మీ పరువును జగన్ మీడియా ద్వారా బజారులో పెట్టుకుంటున్నారు..

ఆరోపణలు చేస్తే వాస్తవాలకు దగ్గరగా ఉండాలి..

జగన్ పై ప్రేమతో రాష్ట్రాన్ని బలి చేస్తారా..రాష్ట్ర ప్రతిష్టను రోడ్డు పాల్జేస్తారా..

మిగులు రాష్ట్రం తెలంగాణ కన్నా అన్ని రంగాల్లో ముందున్నందుకు గర్వపడాల్సిందిపోయి ఇలా మాట్లాడటం దురదృష్టకరం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *