పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్

పాన్ కార్డు కు ప్రత్యామ్నాయంగా ఆధార్ రూ.10 లక్షల స్తిరాస్థి కొంటేనే ‘పాన్’!! ఆధార్‌ను రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలకూ వాడుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం ఇక్కడ స్పష్టం చేశారు..బడ్జెట్ నిర్ణయం నేపథ్యంలో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు బదులుగా ఆధార్‌ను సమర్పించ వచ్చునన్నారు. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలు ఈ మార్పును అనుమతించాల్సిందేనని అజయ్ భూషణ్ పాండే తెలిపారు. నల్లధనం కట్టడిలో భాగంగా రూ.50 వేలు దాటిన విదేశీ ప్రయాణ […]

Continue Reading

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్…

కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య… ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్….. నవ మోసాలు మోసి, కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన తల్లి పట్ల ఓ కొడుకు రాక్షసంగా ప్రవర్తించాడు. భార్యతో కలిసి తల్లి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె కంటి దగ్గర నరాలను కత్తిరించి.. శరీరంలోని పలు ఎముకలను విరిచేసి… చివరకు వాటిని తట్టుకోలేక ఆమె చనిపోయేటట్లు చేశారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి…. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా… […]

Continue Reading

బంగాళాఖాతంలో అల్పపీడనం…’ఫణి’ గా నామకరణం..

బంగాళాఖాతంలో అల్పపీడనం…’ఫణి’ గా నామకరణం.. 36 గంటల్లో తుఫాను గా మారే అవకాశం.. దక్షిణ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. మధ్యాహ్నం లోపు అల్పపీడనం వాయుగుండంగా మారింది. 36 గంటలు గంటల్లో వాయుగుండం తుఫాన్ గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.. ఈ తుఫాను కు ఫణి అని నామకరణం చేశారు.దీని ప్రభావం తమిళనాడు పై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 27వ తేదీ నుండి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ […]

Continue Reading

నేరస్థులకు సహాయం చిలుక అరెస్ట్

[3:47 PM, 4/26/2019] Srinivasula Reddy Sakshi: నేరస్థులకు సహాయం చిలుక అరెస్ట్ (ఆదాబ్ హైదరాబాద్):చిలుకను సాధారణంగా పంజరంలో ఉంచుతారు. కానీ వీరు మాత్రం మనుషుల్ని నిర్బంధించినట్లు జైల్లో పెట్టారు. ఎందుకో తెలుసా.. ఆ చిలక నేరస్థులకు సాయం చేయడమే. వివరాల్లోకి వెళితే.. ఈ విస్తుగొలిపే ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. అక్కడ స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు.. నిందితులు ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్‌ను సరఫరా చేస్తున్నారన్న  సమాచారం అందింది. దీంతో ఆ […]

Continue Reading

పశ్చిమబెంగాల్ తీవ్ర ఉద్రిక్తత

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో రెండవ దశ పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. టీఎంసీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఘర్షణ పడ్డారు. రాయ్‌గంజ్ నియోజకవర్గంలో అల్లరిమూకలు రాళ్లు రువ్వటంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. మరోవైపు ఓ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనివ్వటం లేదని బీజేపీ అభ్యర్థి దేబశ్రీ చౌధురి ఆరోపించారు. చోప్రాలోని ఓ పోలింగ్ బూత్‌లో తమను ఓటేసేందుకు అనుమతినివ్వటం లేదని స్థానికులు 34వ జాతీయ రహదారిపై […]

Continue Reading

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం

దంతెవాడ:చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో రిజర్వ్ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దంతెవాడలోని ధనికార్క్ అడవుల్లో గాలిస్తుండగా కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు కాల్పులు జరుపగా రిజర్వు గార్డులు తిరిగి కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కంకర్, రాజనందన్ గామ్, మహాసముందలో గురువారం పోలింగ్ సాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Continue Reading

పబ్లిక్ పార్కులో ఘోరం.. అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరార్…

పబ్లిక్ పార్కులో ఘోరం.. అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరార్… దుబాయ్: ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడు, ఆమె దుస్తులు తీసుకుని పరారైన వైనమిది.. దుబాయ్‌లోని ఓ పబ్లిక్ పార్కు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. పార్కు వద్ద ఓ యువజంట నడుస్తూ ఉండగా ఓ వ్యక్తి వారిని అడ్డగించాడు. ‘‘మీరు ఎవరు, ఇక్కడ ఏంచేస్తున్నారు…’’ అంటూ ఆ జంటపై ప్రశ్నలు కురిపించాడు. వారు సమాధానం చెప్పేందుకు తిరస్కరించడంతో, తాను […]

Continue Reading

నీరవ్ మోదీ అరెస్టు-భారత్‌ అతి పెద్ద దౌత్యవిజయం సాధించింది.

నీరవ్ మోదీ అరెస్టు………………న్యూఢిల్లీ: భారత్‌ అతి పెద్ద దౌత్యవిజయం సాధించింది. ఇండియాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు బకాయి పడి తప్పించుకుని తిరుగుతున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. దీంతో ఆయనను భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్టేనని చెబుతున్నారు. నీరవ్ మోదీని మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడి కోర్టులో హాజరుపరచనున్నట్టు తాజా సమాచారం. నీరవ్ మోదీ, అతడి మేనమామ మోహుల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సుమారు రూ.14 […]

Continue Reading

భారత్‌లో ఆరు అణు కర్మాగారాలు నిర్మించనున్నఅమెరికా

భారత్‌లో ఆరు అణు కర్మాగారాలు నిర్మించనున్నఅమెరికా భారత్‌తో ద్వైపాక్షిక భద్రత, పౌర అణు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆరు అణు విద్యుత్‌ కర్మాగారాలను నిర్మించడానికి అమెరికా అంగీకారం తెలిపింది. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వం కోసం మద్దతు ఇస్తున్నట్లు వివరించింది. *భారత్‌-అమెరికా వ్యూహాత్మక భద్రతా వ్యవస్థ 9వ విడత చర్చల అనంతరం రెండు దేశాలు ఈ సంయుక్త ప్రకటన వెలువడింది. ఈ చర్చలకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే, […]

Continue Reading

డిపాజిట్ల రేటును  తగ్గించిన ఎస్‌బీఐ 

డిపాజిట్ల రేటును  తగ్గించిన ఎస్‌బీఐ ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. పొదుపు ఖాతాలు, స్వల్పకాలిక రుణ రేట్లను రెపోరేటుకు అనుసంధానం చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. తొలిసారిగా ఎక్స్‌టర్నల్‌ ప్రమాణిక వడ్డీరేట్లకు కలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన రేట్లు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తీసుకొచ్చింది. రూ.లక్ష పైబడిన సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లపై ప్రస్తుతం ఏడాదికి 3.50 […]

Continue Reading